![]() |
![]() |
తమిళ్, హిందీ భాషలలో సందడి చేసిన విక్రమ్ మూవీ ట్రైలర్ తాజాగా తెలుగులో కూడా విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా మెగా రిలీజ్ ఐన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అడవిలో ఉండే సింహం, పులి, చిరుత అన్నీ వేటకు వెళ్తాయి.. జింక తప్పించుకోవాలని చూస్తుంది.. ఆలోపు సూర్యాస్తమయమైతే, రేపటి సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరు? అని కమల్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. బలవంతులైన ముగ్గురు తెలివిగల వ్యక్తుల మధ్య నడిచే స్టోరీ గా విక్రమ్ సినిమా ఉంటుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. తమిళ్, హిందీ భాషల్లో ఈ మధ్యనే విడుదలైన విక్రమ్ ట్రైలర్ కు యూట్యూబులో రెస్పాన్స్ ఓ రేంజులో ఉంది. తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభించే విధంగా ఉంది. కార్తీ ఖైదీ తర్వాత లోకేష్ కనగరాజ్ మరోసారి చీకట్లో మ్యాజిక్ ను చెయ్యబోతున్నాడు. ఇందులో విలక్షణ నటులైన విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరో సూర్య అతిధి పాత్రలో మెరవబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ఈ చిత్రం విడుదలవబోతుంది.
![]() |
![]() |