వేరే భాషల చిత్రాలలో నటించే హీరోలు తెలుగులో కూడా సత్తా చాటితే, ఇక ఆ స్టార్ గత చిత్రాల తవ్వకాల్లో టాలీవుడ్ చాలా బిజీగా ఉంటుంది. కోలీవుడ్, శాండల్ వుడ్ లలో స్టార్ హీరోలైన సూర్య, కార్తీ, విక్రమ్, సుదీప్ లాంటి హీరోలు తెలుగులో పాపులర్ ఐన తర్వాతనే వారి గత రీజినల్ సినిమాలు ఇక్కడ సందడి చేసాయి. తాజాగా రాఖీభాయ్ యష్ కూడా అదే బాట పట్టాడు. కేజీఎఫ్ 1, 2 లతో పాన్ ఇండియా ఐడెంటిటీని, క్రేజును సంపాదించుకున్న యష్ గత సినిమాల వేటలో టాలీవుడ్ చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలో యష్ పదేళ్ల క్రితం నటించిన లక్కీ అనే కన్నడ చిత్రాన్ని లక్కీస్టార్ గా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఇందులో యష్ సరసన దివ్య స్పందన (రమ్య) హీరోయిన్ గా నటించింది. లక్కీ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ గా సూరి డైరెక్ట్ చేసారు. ఈ మూవీ తెలుగు హక్కులను శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవి రాజ్ కొనుగోలు చేసారు. తెలుగులో సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదలకానుంది.