ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ స్టార్ హీరోను వంటమేస్త్రిగా మార్చేసిన నయన్ బాయ్ ఫ్రెండ్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:56 PM



తమిళ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ తన 62 వ సినిమాను చెయ్యబోతున్నట్టు కోలీవుడ్ మీడియా సమాచారం. ఇందులో నయనతార హీరోయిన్గా నటించబోతుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయట. తాజాగా ఈ సినిమాపై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ వినబడుతుంది. అదేంటంటే, అజిత్ ఈ సినిమాలో చెఫ్ లా నటించబోతున్నాడట. చెఫ్ అంటే మాములు చెఫ్ కాదు... చెఫ్ నుండి ఒక పెద్ద ఎంటర్ ప్రెన్యూర్ గా మారి తమిళనాడులోని పలు స్టార్ హోటల్స్ కు, రిచ్ రెస్టారెంట్లకు యజమాని గా ఎదిగిన పాత్రలో కనిపించబోతున్నారట. ఈ పాత్ర అజిత్ నిజజీవితానికి చాలా దగ్గరగా ఉండబోతుంది. ఎందుకంటే, రియల్ లైఫ్ లో అజిత్ మంచి ఫుడీ మరియు చెయ్యితిరిగిన చెఫ్. విగ్నేష్ సినిమాలో అజిత్ చెఫ్ గా నటించబోతున్నాడన్న వార్తపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ సినిమాను చాలా సింపుల్ గా, ఒకటి రెండు షెడ్యూల్స్ లోనే పూర్తి చెయ్యాలని విఘ్నేష్ భావిస్తున్నాడట. AK #61 కన్నా ముందే ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చెయ్యాలనుకుంటున్నారట మేకర్స్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com