ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసిన నివిన్ పాలీ "పడవెట్టు" మూవీ

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:59 PM



మలయాళ నటుడు సన్నీ వేనే నిర్మాతగా, టాలెంటెడ్ హీరో నివిన్ పాలీ హీరోగా రూపొందుతున్న చిత్రం పడవెట్టు. ఈ సినిమాతో లిజు కృష్ణ దర్శకుడిగా పరిచయమవనున్నారు. అదితి బాలన్ హీరోయిన్ కాగా మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం మలయాళ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మలయాళంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్ని అపవాదులు కారణంగా గత కొంతకాలం నుండి ఎదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సరిగ్గా, ఈ సినిమా పూర్తయిపోతుందనుకునే ఆఖరి షెడ్యూల్ లో డైరెక్టర్ లీజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసారు. లిజు కృష్ణ తో కొన్నాళ్లుగా పరిచయం ఉన్న ఒక యువతి చేసిన అత్యాచార ఆరోపణల రీత్యా ఆయనను అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఈ క్రమంలో చివరి దశలో ఉన్న ఈ సినిమాను అసిస్టెంట్ డైరెక్టర్లు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఎలాగైతేనేం, ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. సెప్టెంబర్ 2, 2022 న ఈ సినిమా థియేటర్లలో విడుదలకాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com