ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గాడ్ ఫాదర్' సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:59 PM



మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా మలయాళంలో "లూసిఫర్‌" సినిమాకు రీమేక్. "గాడ్ ఫాదర్" సినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పొలిటికల్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ఒక పాట షూటింగ్‌ను జూన్ మొదటి వారంలో ప్రారంభిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాటలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కనిపించనున్నారు అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com