'RRR', 'గంగూబాయ్ కతియావాడి' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ 'డార్లింగ్స్' సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. జస్మీత్ కె రీన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామాలో షెఫాలీ షా, విజయ్ వర్మ మరియు రోషన్ మాథ్యూ కూడా కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఇప్పుడు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్ఫ్లిక్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ఒక వీడియో గ్లింప్సె విడుదల చేసింది. అయితే, నెట్‌ఫ్లిక్స్ ఇంకా ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించలేదు. విశాల్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.