ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగ చైతన్య - పరశురామ్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 01:13 PM



టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ హీరో ఇప్పటికే వెంకట్ ప్రభు మరియు విక్రమ్ కుమార్‌లతో సినిమాలకు సైన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. చైతూ దర్శకుడు పరుశురామ్ తో ప్రాజెక్ట్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. పరశురామ్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను ఇప్పటికే లాక్ చేసినట్లు సమాచారం. తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి 'నాగేశ్వరరావు' అనే టైటిల్ ని పెట్టాలని పరశురామ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వార్త పై మూవీ మేకర్స్ అధికారకంగా ఏమి ప్రకటించలేదు కానీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రానున్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. రొమాంటిక్ కామెడీట్రాక్ లో రానున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com