ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తలపతి 66' సినిమాపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన PR టీమ్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 01:18 PM



తమిళ స్టార్ హీరో తలపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి  తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా "తలపతి66" అని టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ఈ తెలుగు-తమిళ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మేక, సంగీత మరియు జయసుధ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఇప్పుడు, ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా కూడా ఈ బిగ్గీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, PR టీమ్ ఈ మూవీలో మెహ్రీన్ పిర్జాదా భాగం కాదు అని క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com