ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న కమల్ హాసన్ 'విక్రమ్'

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 01:20 PM



లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రం సెన్సార్‌తో పాటు అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ని పొందినట్లు సమాచారం. అలాగే, ఈ సినిమా 153 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విక్రమ్ సినిమా జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల కానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com