ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా ఓటిటి మొదటి స్థానంలో ఆర్ ఆర్ ఆర్ జోరు.. ఆ దేశాల్లో కూడా టాప్ పొజిషన్ లో

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 03:37 PM



దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక్క ఇండియాలోనే కాక ఓవర్సీస్ లో కూడా ఆర్ ఆర్ ఆర్ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఆర్ ఆర్ ఆర్ థియేట్రికల్ రన్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన రాగా డిజిటల్ స్టీమింగ్ లో ఇలాంటి స్పందన ఉండకపోవచ్చని చాలా మంది భావించారు. 


ప్రఖ్యాత ఓటిటి జీ 5 లో మే 20 నుండి ఆర్ ఆర్ ఆర్ స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ తప్ప మిగిలిన అన్ని భాషల్లో జీ 5 ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చిన ఆర్ ఆర్ ఆర్ ఐదు రోజుల్లోనే ఇండియాస్ టాప్ వన్ ఓటిటి పొజిషన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా యూఏఈ, కెనడా, పాకిస్థాన్ వంటి దేశాలలో కూడా ఆర్ ఆర్ ఆర్ ఓటిటి వెర్షన్ టాప్ 10 లో ఉండటం విశేషం. దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారు, ఆయాదేశాల సినీ ప్రేమికులు ఆర్ ఆర్ ఆర్ పట్ల చూపిస్తున్న క్రేజ్ వల్లే ఇది సాధ్యపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com