ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేజర్ నుండి హార్ట్ టచింగ్ వీడియో సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 03:38 PM



భారతీయ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం మేజర్. 2008 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా, శశికిరణ్ తిక్కా మేజర్ చిత్రాన్ని రూపొందించారు. లీడ్ రోల్ లో అడవి శేష్ నటించటంతో పాటు ఈ చిత్రానికి రచయితగాను పనిచేసారు. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్,A +S మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, లిరికల్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. తాజాగా ఈ చిత్రం నుండి హార్ట్ టచింగ్ ఎమోషనల్ సాంగ్ "హృదయమా.." విడుదలైంది. ఆర్మీలో జాయిన్ అయిన తన ప్రియుని కోసం పరితపిస్తున్న హీరోయిన్, అలానే ప్రేయసి జ్ఞాపకాలతో చిత్రవధ అనుభవిస్తున్న హీరో ఎమోషన్స్ ను ఈ పాటలో చాలా బాగా చూపించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అద్భుతంగా ఉంది. సిద్ధ్ శ్రీరామ్ ఎంతో ఎమోషనల్ గా పాడిన ఈ పాటకు కృష్ణ కాంత్ సాహిత్యమందించారు. జూన్ 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com