'అందాల రాక్షసి' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం సీతారామం. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మండన్నా అఫ్రీన్ అనే కాశ్మీరీ యువతీ పాత్రలో సరికొత్తగా కనిపించబోతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, లిరికల్ సాంగ్స్ సినిమాపై ఇంటరెస్ట్ ను తీసుకొస్తున్నాయి. తాజాగా ఈ మూవీని ఆగస్టులో విడుదల చెయ్యబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. మలయాళ, తెలుగు, తమిళ భాషలలో ఆగస్టు 5వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలకాబోతుంది.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీదత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంత్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.