ట్రెండింగ్
Epaper    English    தமிழ்

NBK 108లో 'బాబాయ్' కు జతగా అబ్బాయ్ హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 03:43 PM



నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం NBK 107 సినిమాలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న చిత్రమిదే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్. ఇంకా టైటిల్ ఖరారు  చెయ్యని ఈ మూవీ లో వరలక్షి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ అంతిమదశకు చేరుకున్న ఈ మూవీ పూర్తైన వెంటనే బాలయ్య వినోదభరిత చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108వ సినిమాను చెయ్యనున్నారు. ప్రస్తుతం ఎఫ్ 3 ప్రమోషన్స్ చేస్తున్న అనిల్ ఆ కార్యక్రమాల్లో బాలయ్య 108 మూవీ గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ షేర్ చేస్తూ తగిన బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో బాలయ్య యాభై ఏళ్ళ తండ్రి పాత్రలో నటిస్తారని, ఆయనకు కూతురిగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ, పెళ్లిసందD ఫేమ్ శ్రీలీల నటించబోతుందని చెప్పి ప్రేక్షకులను థ్రిల్ చేసారు. 


తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్యకు జతగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి ని చిత్రబృందం ఎంపిక చేసిందట. ఈ మేరకు దర్శకుడు అనిల్ ప్రియమణిని కలిసి NBK 108 కథను వివరించారని, కథ నచ్చిన ప్రియమణి ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ప్రియమణి గతంలోలాగా ఇప్పుడు తరచు సినిమాలను చెయ్యటం లేదు కానీ, వెబ్ సిరీస్ లు, బుల్లితెర షోలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె క్రేజ్ కూడా ఈ సినిమాకు ఒకరకంగా ప్లస్ అవుతుందని చిత్రబృందం ప్రియమణిని సెలెక్ట్ చేశారట. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com