ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'777 చార్లీ' మూవీలో నటించిన కుక్కపిల్ల గురించి ఆసక్తికర విషయలు

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 10:46 PM



ప్రముఖ కన్నడ దర్శకుడు, నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం '777చార్లీ'. కిరణ్ రాజ్ దర్శకత్వంలో కామెడీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని జి.ఎస్ గుప్తా తో కలిసి రక్షిత్ శెట్టి నిర్మించారు. ఇటీవలే రిలీజ్ ఐన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి ముఖ్యంగా పెంపుడు కుక్కలను ప్రాణంగా చూసుకునే వారినుండి అద్భుతమైన స్పందన వచ్చింది. 


ఈ మూవీ కథ మొత్తం ఒక కుక్కపిల్ల చుట్టూ తిరుగుతుంది. ఆ కుక్కపిల్లకు, రక్షిత్ కు మధ్య ఏర్పడిన బంధాన్ని ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించినట్టు తెలుస్తుంది. 


తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు కిరణ్ రాజ్ కుక్కపిల్ల గురించి ఆసక్తికర విషయలు తెలిపారు. ఈ సినిమాలో నటించిన కుక్కపిల్ల లాబ్రడార్ జాతికి చెందినదని, అద్భుతమైన భావోద్వేగాలు పలికించడంలో ఆ జాతి కుక్కలు చాలా మెరుగైనవని చెప్పారు. 777చార్లీ లో నటించేందుకుగాను ఆ కుక్కపిల్లకు 2- 2.6 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చామని, ట్రైలర్ ఆఖరిలో వచ్చే ఒక సీన్ (హీరో ను చార్లీ హగ్ చేసుకునే సీన్ ) కోసం దాదాపు ఒక సంవత్సరం సమయం పట్టిందని చెప్పారు. పెంపుడు జంతువులను అమితంగా ప్రేమించే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని, పెంపుడు జంతువులు ఇష్టపడని వారు ఈ సినిమా చూస్తే వాటి పట్ల ఖచ్చితంగా ఇష్టం కలుగుతుందని ఆయన తెలిపారు. పాన్ ఇండియా రేంజులో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ జూన్ 10వ తేదీన విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com