ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుల్కర్ 'సీతా రామం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 11:26 PM



హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమా  'సీతా రామం'.ఈ  సినిమాలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయినిగా నటిస్తుంది. యుద్ధ నేపథ్యంలో సాగే ఈ ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాలో రష్మిక మందన్న అఫ్రీన్ అనే ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ  సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ  సినిమాని  వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్‌పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com