అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఏజెంట్'. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం మనాలిలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాని ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నరు. ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది.