టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని నటవారసుడు అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. అఖిల్ గత చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డీసెంట్ హిట్ గా నిలిచింది. అఖిల్ కు చాన్నాళ్ల తర్వాత సూపర్ హిట్ ను అందించింది ఆ సినిమా. ఆ మూవీ సక్సెస్ ను ఏజెంట్ తో కొనసాగించాలని అఖిల్ అనుకుంటున్నాడు. ఇందుకోసం ప్రొఫెషనల్ ఏజెంట్ లుక్ కై తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చేశాడు. ఈ సినిమాలో డిఫరెంట్ మేకోవర్ తో లవర్ బాయ్ ఇమేజ్ ను కాస్త పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏజెంట్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని చిత్రసీమలో వార్తలు వినబడుతున్నాయి. ఆ మొత్తం ఎంతంటే, అక్షరాలా... రూ. 80 కోట్లు. పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ సంస్థ ఏజెంట్ మేకర్స్ కు ఎనభై కోట్ల భారీ మొత్తాన్ని అందించారని వినికిడి. దీంతో ఏజెంట్ మూవీ పెట్టుబడి చాలావరకు నిర్మాతల చేతికొచ్చేసిందని తెలుస్తుంది.