ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ 30 కోసం ఆ ముగ్గురిపై ఒత్తిడి తీసుకొస్తున్న కొరటాల

cinema |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:15 PM



సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న తన సినీ కెరీర్ లో ఆచార్య తీసుకొచ్చిన డిజాస్టర్ అపవాదును వీలైనంత త్వరగా తొలగించుకుని తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావాలనుకుంటున్న కొరటాల అందుకు సంబంధించిన పనులను వేగంగా కానిచ్చేస్తున్నారు. ఆచార్య విడుదలై నెల తిరక్కుండానే తారక్ తో సినిమాను ప్రకటించి తనలో ఉన్న విజయకాంక్షను అందరికి తెలియచేసాడు. ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ తో కొంత సక్సెస్ ఐన కొరటాల పూర్తి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ప్లాన్ చేసాడు. అందుకోసం ఏ చిన్న విషయాన్ని కూడా అశ్రద్ధ చెయ్యకుండా అన్నిటిని దగ్గరుండి చూసుకుంటున్నాడు. దీంతో కొరటాల సినిమాకు పనిచేస్తున్న ముగ్గురిని తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నారని చిత్రవర్గ సమాచారం. 


కొరటాల ఒత్తిడి తీసుకొస్తున్న వారిలో మొదటివాడు సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్. ఈ విషయం అందరికి తెలిసిందే. కోలీవుడ్ లో స్టార్ కంపోజరైన అనిరుద్ తెలుగులో మాత్రం తన సత్తాను చూపించలేకపోతున్నాడు. తెలుగులో ఆయన చేసిన అజ్ఞాతవాసి, జెర్సీ వంటి సినిమాలు మ్యూజికల్ గా హిట్ అవ్వలేకపోయాయి. దీంతో కొరటాల అనిరుద్ కు కొన్ని దిశానిర్దేశాలు చేస్తున్నారట. ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్, పుష్ప సినిమాలోని పాటలు నేషన్ వైడ్ గా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో, ఎన్టీఆర్ 30 సినిమాకు కూడా అలాంటి చార్ట్ బస్టర్ ను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట. తెలుగులో తనను నిరూపించుకోవాలనుకుంటున్న అనిరుద్ ఎన్టీఆర్ 30 పాటలను స్వరపరచడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడట. 


కొరటాల ఒత్తిడి తీసుకొస్తున్న వారిలో మిగిలిన ఇద్దరు ఎవరంటే... కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. పుష్ప సినిమాలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన బన్నీ మ్యానరిజమ్స్ కు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ వచ్చిందో అందరికి తెలిసిందే. అలానే, జానీ మాస్టర్ కంపోజ్ చేసిన అరబిక్ కుతూ స్టెప్స్ కూడా బాగా క్లిక్ అయ్యాయి. అలాంటి హుక్ స్టెప్స్, యువత ను ఉర్రూతలూగించే మాస్సివ్ స్టెప్స్ ను డిజైన్ చెయ్యమని కొరటాల శేఖర్, జానీ మాస్టర్లను కోరుతున్నాడట. తారక్ ఎలానో అగ్రెసివ్ డాన్సర్ కాబట్టి వారిద్దరూ కంపోజ్ చేసే స్టెప్స్ కు పుష్పకు మించిన రెస్పాన్స్ వస్తుందని కొరటాల నమ్మకం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com