"భాగమతి" మూవీ నుంచి 'మందార మందార' పాట లిరిక్స్:
మందార మందార
కరిగే తెల్లారెలా
కిరణాలే నన్నే చేరేలా
కళ్ళారా కళ్ళారా
చూస్తున్నా కళ్ళారా
సరికొత్త స్నేహం దరిచేరా
అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే
ఏదో అసలది బదులో
ఏమో అది తేలేనా
కుదురుగాా ఉండే మదిలో
చిలిపిగా ఎగిరే ఎదలో
తెలియని భావం తెలిసే కథ మారేనా
నీ వెంట అడుగే వేస్తూ
నీ నీడనై గమనిస్తూ
నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ
నీలో చూస్తున్నా
మందార మందార
కరిగే తెల్లారెలా
కిరణాలే నన్నే చేరేలా
కళ్ళారా కళ్ళారా
చూస్తున్నా కళ్ళారా
సరికొత్త స్నేహం దరిచేరా
సుందర... మందార... కళ్ళారా... సుందర.
మందార మందార
కరిగే తెల్లారెలా
కిరణాలే నన్నే చేరేలా
ఉనికిని చాటే ఊపిరి కూడా
ఉలికి పడేలా ఉందే ఇలా
కలలోనైనా కలగనలేదే
విడిపోతుందని అరమరికా...
కడలై నాలో నువ్వే
అలనై నీలో నేనే
ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా
కాలాలనే మరిపిస్తూ
ఆనంధమే అందిస్తూ
నా ప్రయాణమై నా గమ్యానివై
నా నువ్వవుతున్నావే
మందార మందార
కరిగే తెల్లారెలా
కిరణాలే నన్నే చేరేలా
కళ్ళారా కళ్ళారా
చూస్తున్నా కళ్ళారా
సరికొత్త స్నేహం దరిచేరా