టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న విడుదల కావాల్సివుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక విడుదల తేదీని గతంలోనే ప్రకటించింది. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటమే ఇందుకు కారణమని మేకర్స్ తెలిపారు. బెస్ట్ ఔట్ పుట్ తో వీలైనంత త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రామారావు ను తీసుకొస్తామని మేకర్స్ తెలిపారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, RT టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేసాయి.