‘ఆర్ఎక్స్100’ హీరోయిన్ అప్పుడే మొదలుపెట్టేసింది

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 13, 2018, 02:42 PM

‘ఆర్ఎక్స్100’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే ఈ పంజాబీ భామ తెలుగు కుర్రాళ్లను కట్టిపడేసింది. బోల్డ్ రొమాన్స్‌తో యువతను పిచ్చెక్కించింది. ఒక్క సినిమాతోనే విపరీతమైన పాపులర్ అయిపోయింది. సాధారణంగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లను వ్యాపార సంస్థలు తమ ప్రచారం కోసం వాడేస్తూ ఉంటాయి. హీరోయిన్లు కూడా జనంలోని మరింతగా వెళ్లడానికి ఇలాంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలకు పచ్చజెండా ఊపేస్తుంటారు. ఇప్పుడు ఆ కోవలోకి పాయల్ కూడా చేరిపోయింది. 


హైదరాబాద్‌లోని కొత్తపేటలో ‘కళ్యాణ మహాలక్ష్మి’ షాపింగ్ మాల్‌ను ఆదివారం పాయల్ ప్రారంభించింది. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను అనుసరించి ప్రపంచస్థాయి నాణ్యతతో కాంచీపురం (కంచి) పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయంగా కళ్యాణ మహాలక్ష్మి షాపింగ్ మాల్‌ను ప్రారంభించినట్లు చైర్మన్ రంగ రవిందర్ గుప్తా (బుల్లెట్ రవి), ఎండీ సంధ్య రెడ్డి తెలిపారు. తమ వద్ద కంచి, బెనారస్, ఇక్కట్, ఉప్పాడా, గద్వాల్, కుప్పాడం, ఆరని పట్టు చీరలు.. కోల్కతా వర్క్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, ఎంబ్రాడ్రీ సారీస్, ఫ్యాన్సీ సారీస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు. 


 
Recent Post