వెరైటీగా కికి ఛాలెంజ్‌లో పాల్గొన్న కాజ‌ల్‌,బెల్లంకొండ శ్రీ‌నివాస్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 13, 2018, 03:45 PM

ప్రయాణిస్తున్న వాహనం నుంచి కిందకు దిగి డ్యాన్స్ చేస్తూ, మళ్లీ వాహనంలోకి ఎక్కడమే కికి ఛాలెంజ్. ఈ డ్యాన్స్ ను వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలి. చూడ్డానికి ఈ ఛాలెంజ్ చాలా సరదాగా ఉన్నప్పటికీ, ఎంతో మంది ఈ ఛాలెంజ్ వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో, ఈ ఛాలెంజ్ పై పోలీసులు నిషేధం విధించారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ లు సరదాగా కికి ఛాలెంజ్ లో పాల్గొన్నారు. అయితే, రోడ్డుపై కాకుండా సురక్షితమైన ప్రాంతంలో, కొంచెం వెరైటీగా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recent Post