రష్మిక.. ఈ సినిమాలన్నీ విడుదలైతే

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 13, 2018, 04:56 PM

తను ఇంట్రడ్యూస్ అయిన సినిమాతోనే కన్నడలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది రష్మికా మందన్న. ‘కిరిక్ పార్టీ’తో శాండల్‌వుడ్‌కు పరిచయం అయిన రష్మిక కేవలం కన్నడనాటే కాకుండా.. పక్క రాష్ట్రాల సినీ పరిశ్రమల్లో కూడా గుర్తింపును సంపాదించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో కూడా అవకాశాలు పొందుతోంది. ఇప్పటికే ఈమె తొలి తెలుగు సినిమా ‘చలో’ విడుదల అయ్యింది. ఈ వారంలో ‘గీతగోవిందం’ విడుదల కాబోతోంది. ఈ సినిమా పట్ల యూత్‌లో మంచి క్రేజ్ కనిపిస్తోంది. 


ఇది గనుక హిట్ అయితే రష్మికను టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వరించే అవకాశాలున్నాయి. ఇప్పటికే రష్మిక చేతిలో పలు సినిమాలున్నాయి. నాగార్జున, నాని కాంబోలో రూపొందుతున్న ‘దేవదాస్’, విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడలో కూడా ఒక సినిమా చేస్తోంది. ఇలా చేతినిండా అవకాశాలను కలిగి ఉంది ఈ హీరోయిన్. 


 


ఈ నేపథ్యంలో ‘గీతగోవిందం’ హిట్ అయితే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాస్ ఇమేజ్‌ ఉన్న పెద్ద హీరోల సరసన రష్మికకు అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. ఆగస్టు 15న ‘గీతగోవిందం’ విడుదల కాబోతోంది. 
Recent Post