నవంబర్‌ 20న దీప్‌వీర్‌ వెడ్డింగ్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 14, 2018, 02:16 PM

బాలీవుడ్‌ హాట్‌ జోడీ రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పడుకోన్‌ల వివాహంపై రోజుకో వార్త హల్‌చల్‌ చేస్తుండగా, తాజాగా వీరి వెడ్డింగ్‌పై ఆసక్తికర విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. వీరిద్దరూ తమ అనుబంధంపై ఎన్నడూ బహిరంగంగా నోరుమెదపకపోయినా ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.గతంలో నవంబర్‌ 10న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవుతారని ప్రచారం సాగితే తాజాగా వివాహ ముహుర్తం నవంబర్‌ 20న పక్కా అంటూ వార్తలొచ్చాయి. ఇటలీలోని కోమో సరస్సు వీరి వివాహ వేడుకకు వేదికగా నిలవనుంది.


దీప్‌వీర్‌ వివాహ వేడుకకు 30 మంది ఎంపిక చేసిన అతిధులకు మాత్రమే ఆహ్వానాలు వెళ్లనున్నాయి. దీపికా, రణ్‌వీర్‌లు ఈ ఏడాది నూతన సంవత్సరం రోజు మాల్దీవుల్లో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌లో మునిగితేలారు. దీపికా బర్త్‌డే రోజు వీరిరువురి నిశ్చితార్ధం జరిగిందని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
Recent Post