నా రియ‌ల్ భ‌ర్త‌తో గ‌డిపిన స‌మ‌యం త‌క్కువ‌

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 14, 2018, 02:20 PM

`నా రియ‌ల్ లైఫ్ భ‌ర్తతో కంటే రీల్ లైఫ్‌ భ‌ర్తతోనే ఎక్కువ స‌మయం గ‌డిపాన‌`ని అనుష్క శ‌ర్మ వ్యాఖ్యానించింది. అనుష్క శ‌ర్మ న‌టించిన తాజా చిత్రం `సూయీ ధాగా`. ఈ సినిమాలో హీరో వ‌రుణ్ ధావ‌న్‌కు భార్య‌గా అనుష్క న‌టించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా త‌న భ‌ర్త కోహ్లీ గురించి, ఇటీవ‌ల త‌లెత్తిన వివాదం గురించి స్పందించింది.


 `ఓ గృహిణి ఎలా ఉండాల‌నే విష‌యాన్ని ఈ సినిమా ద్వారానే నేర్చుకున్నాను. నేను ప‌దిహేనేళ్ల వ‌య‌సు నుంచే సంపాదిస్తున్నా. పెళ్లి చేసుకున్న త‌ర్వాత కూడా నా ప‌నిని కొన‌సాగిస్తున్నా. ఎన్నో విష‌యాలు నేర్చుకున్నా. అయితే ఈ సినిమా మ‌రో కొత్త విష‌యం నేర్పింది. ఇంటిప‌ట్టునే ఉంటూ అన్ని ప‌నులూ చూసుకునే భార్య‌గా ఈ సినిమాలో న‌టించా. ఈ సినిమాలో నా రీల్ భ‌ర్త‌తో గ‌డిపిన స‌మ‌యం కంటే.. నా రియ‌ల్ భ‌ర్త‌తో గ‌డిపిన స‌మ‌యం త‌క్కువ‌` అని అనుష్క‌ చెప్పింది. అలాగే ఇటీవ‌ల లండ‌న్‌లో టీమిండియ‌తో దిగిన ఫోటో వివాదాస్ప‌దం కావ‌డం గురించి మాట్లాడుతూ.. ఆ వివాదం గురించి స్పందించాల్సిన వారు స్పందించార‌ని, నెటిజ‌న్ల కామెంట్ల‌ను తాను అంత‌గా పట్టించుకోన‌ని స్ప‌ష్టం చేసింది.
Recent Post