భువనేశ్వరి పాత్రలో మలయాళ నటి

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 14, 2018, 03:07 PM

టాలీవుడ్ లో `ఎన్టీఆర్ `బయోపిక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ బయోపిక్ పై భారీ అంచనాలున్నాయి. తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత క్రిష్ పగ్గాలు చేపట్టడం....బాలకృష్ణకు ఓ వరంలా మారిందని చెప్పవచ్చు. క్రిష్ వచ్చిన తర్వాత `ఎన్టీఆర్ `లో కీలక పాత్రల కోసం టాలీవుడ్ - బాలీవుడ్ లోని ప్రముఖ నటులను ఏరికోరి ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరో కీలకపాత్ర అయిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాత్రలో ఎవరు నటించబోతున్నారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పాత్రలో మలయాళ నటి మంజిమా మోహన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎంపిక దాదాపు ఫైనల్ అయిందని తెలుస్తోంది.


టాలీవుడ్ అప్ కమింగ్ బయోపిక్ లకు `మహానటి` ఓ బెంచ్ మార్క్ సెట్ చేయడంతో....`ఎన్టీఆర్` ను క్రిష్ ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. అందులోనూ తన తండ్రి బయోపిక్ టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని బాలకృష్ణ...ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీంతో ఈ చిత్రంలో కీలకమైన పాత్రల కోసం నటీనటులను క్రిష్ ఏరికోరి ఎంచుకుంటున్నారు. తాజాగా నారా భువనేశ్వరి పాత్రలో మంజిమా మోహన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. సాహసం శ్వాసగా సాగిపో తో తెరంగేట్రం చేసిన మంజిమా....ఈ పాత్రకు న్యాయం చేస్తుందని క్రిష్ అనుకున్నారట. లక్ష్మీ పార్వతి పాత్రలో ఆమని నటించబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. మరోవైపు బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ నటిస్తుండగా చంద్రబాబు పాత్రలో రానా నటించబోతున్నారు. మరో కీలకమైన పాత్ర అయిన ఏఎన్నార్ పాత్రలో ....అక్కినేని వారసుడు సుమంత్ నటించబోతున్నాడు. 
Recent Post