షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 14, 2018, 03:58 PM

ఓ తమిళ చిత్రంలో భాగంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ కేరళలో జరుగుతుండగా నటి అమలా పాల్‌ గాయపడ్డారు. అధో అంధ పరవై పోలా చిత్రం షూటింగ్‌లో తన చేతిన మెలితిప్పే సన్నివేశం చిత్రీకరిస్తుండగా లిగ్మెంట్‌ టేర్‌ కావటంతో గాయమైనట్టుగా తెలుస్తోంది. ముందుగా బెణికిందని భావించిన చిత్రయూనిట్ ఫస్ట్‌ఎయిడ్ చేసిన షూటింగ్‌ను కంటిన్యూ చేశారు.అయితే కొద్ది సేపటికి నొప్పి మరింత తీవ్రం కావంటంతో షూటింగ్‌ క్యాన్సిల్ చేసి అమలాను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చేతికి కట్టు వేసిన డాక్టర్లు కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఆమె కేరళలో రెస్ట్‌ తీసుకుంటున్నారు.
Recent Post