ఐటెం సాంగ్స్‌కే తమన్నా ఓటు!

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 14, 2018, 04:46 PM

పనితక్కువ ప్రతిఫలం ఎక్కువ అన్నట్టు ఉంటుంది ఐటెంసాంగ్స్‌ వ్యవహారం. మూడు లేదా నాలుగు రోజుల డేట్లు ఇస్తే చాలు, చాలా మంది స్టార్‌ హీరోయిన్లు వీటికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కెరీర్‌ దాదాపు ఎండింగ్‌ స్టేజీకి రావడం, అవకాశాలు క్రమేపీ సన్నగిల్లడం స్టార్లకు మామూలే! గతంలో అయితే పూర్తిగా తెరమరుగయ్యేవారు. ఇప్పుడు మాత్రం పాటలను కూడా క్యాష్‌ చేసుకునే తెలివితేటలు స్టార్‌ హీరోయిన్లకు ఎక్కువయ్యాయి. ఇలా తెలివితేటలు ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో తమన్నా పేరు ముందు ఉంటుంది. ప్రస్తుతం తమ్ము చేతిలో ఒకటి రెండు సినిమాలకన్నా ఎక్కువ లేవు. దాంతో దక్షిణాది సినిమాల్లో ఐటెంసాంగ్‌లపై మిల్కీబ్యూటీ దృష్టి సారించింది. తాజాగా కన్నడంలో ఓ సినిమాలో ఐటెంసాంగ్‌కు భారీ మొత్తం డిమాండ్‌ చేసిందట! ఎంత అడిగినా ఆమెకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అంత మొత్తం ఇచ్చారట! కాకపోతే అంత ఇచ్చారు...ఇంత ఇచ్చారు అంటున్నారు కానీ సరిగ్గా ఎంత ఇచ్చారు? అన్నదానికి లెక్కలు మాత్రం లేవు.
Recent Post