అందాల 'రాశి’ఖన్నా'.. మెరుపులు

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 14, 2018, 05:23 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు రాశీ ఖన్నా. ఈ భామకు చేతినిండా అవకాశాలున్నాయి. వరసగా విడుదల అవుతున్న సినిమాలు మరీ సూపర్ హిట్స్ కాకపోయినా.. రాశీ ఖన్నాకు అవకాశాల లోటైతే లేదు. కేవలం తెలుగులోనే కాకుండా మాలయళంలో కూడా ఈ హీరోయిన్‌కు అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. తాజాగా గత వారంలో ఈ హీరోయిన్ నటించిన ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా విడుదల అయ్యింది. మిక్డ్స్ టాక్ పొందింది ఆ సినిమా. ఫర్వాలేదనిపించుకుంది. సినిమాలో చీరకట్టులో మెరిసింది రాశి. ఆరు నెలల క్రితం ‘తొలిప్రేమ’లో టీనేజ్ గర్ల్ లా మెరిసిన రాశి ఈ సారి చీరకట్టులో పరిణతిని కనబరిచింది. తను ఎలాంటి పాత్రనైనా చేయగలనని రుజువు చేసుకుంది. 


ప్రస్తుతం ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా యూనిట్ సక్సెస్ టూర్లో ఉంది. తమ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందని ఈ యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. వారిలో భాగమై రాశీ ఖన్నా ఇలా మెరిసింది! 
Recent Post