ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భయపెడుతున్న "విక్రాంత్ రోణ" ట్రైలర్ ...!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 06:53 PMకన్నడ సూపర్ స్టార్ కిచ్ఛా సుదీప్ కొత్త చిత్రం విక్రాంత్ రోణ. అనూప్ భండారీ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. సుదీప్ తో పాటు ఈ సినిమాలో నిరూప్ భండారీ, నీతా అశోక్ ప్రధాన పాత్రలు పోషించారు. 3D లో ప్రపంచవ్యాప్తంగా 19 ఆగష్టు 2021 విడుదలవ్వాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల జూలై 28వ తేదీన విడుదలవడానికి సిద్ధమవుతోంది.
ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. మూవీ నేపధ్యాన్ని మొత్తం ట్రైలర్ లోనే చూపించేసాడు దర్శకుడు. మారుమూల గ్రామానికి పోలీసాఫీసర్ గా వెళ్లిన సుదీప్ ఆ ఊరి ప్రజలను భయపెడుతున్న రహస్యాలను ఒక్కొక్కటిగా చేధిస్తాడు. ఈ క్రమంలో వీటన్నింటికి అతనే కారణమని తెలుసుకుంటాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ చాలా బాగున్నాయి. డిఫరెంట్ వరల్డ్ కు తీసుకెళ్లిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. వెండితెరపై కూడా విక్రాంత్ మ్యాజిక్ చేస్తే ఈ సినిమాకు తిరుగుండదు.
తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో రూపొందిన ఈ సినిమాను మేకర్స్ సుమారు 50దేశాలలో విడుదల చేయబోతున్నారు. జీ స్టూడియోస్, షాలిని ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతిధిగా కనిపించనున్నారు.


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com