క్రేజీ సీక్వెల్ లో జాన్హవి కపూర్ ?

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 20, 2018, 03:34 PM

2008లో ప్రియాంక చోప్ర, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ లు నటించిన 'దోస్తాన' చిత్రానికి రీమేక్ రూపొందనుందని గత కొన్నాళ్లుగా బాలీవుడ్లో వార్తలు వినిస్తున్న సంగతి తెలిసిందే.  దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకముందే ఇందులో నటించబోయే నటీనటుల వివరాలు అంటూ కొన్ని పేర్లు బయటికొచ్చేశాయి. ఈ సీక్వెల్ లో సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించనుండగా, 'ధఢక్'తో వెండి తెర మీదికి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి కుమార్తె జాన్హవి కపూర్ కథానాయకిగా నటిస్తుందనేది ఆ వార్తల సారాంశం.  మరోవైపు ఈ సీక్వెల్ ను తరుణ్ మన్సుకాని డైరెక్ట్ చేస్తారని కూడ అంటున్నారు.  మరి ఈ వార్తలన్నీ వాస్తవమో కాదో తేలాలంటే నిర్మాత కరణ్ జోహార్ నోరు విప్పాల్సిందే. 
Recent Post