ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి ప్రత్యేక గీతంలో మలైకా అరోరా

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 20, 2018, 03:54 PM



పవన్‌కల్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్‌లో ప్రత్యేక గీతంలో కనిపించి ప్రేక్షకులను అలరించింది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. ఈ భామ మరోసారి స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది. బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పటాఖా. సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా, రాధికామదన్ ప్రధాన పాత్రల్లో నటిస్త్తున్నారు. ఈ చిత్రంలో ‘హలో హలో’ అంటూ వచ్చే ప్రత్యేక గీతంలో మలైకా చిందులు వేయనుంది. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య నేతృత్వంలో ఇప్పటికే పాట కోసం శిక్షణ కూడా తీసుకుంది మలైకా. పటాఖాలో హలో హలో ప్రత్యేక గీతాన్ని ఈ వారం షూట్ చేయనున్నట్లు నిర్మాత అజయ్‌కపూర్ తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com