త్రిషకు గోల్డెన్ ఛాన్స్

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 20, 2018, 05:18 PM

ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిషకు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ.. తెలుగులో అస్సలు కనిపించడమే మానేసింది. ఇటీవల తమిళ డబ్బింగ్ సినిమా ‘మోహిని’ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలాంటి కష్టకాలంలో త్రిష గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ‘పిజ్జా’ ఫేం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘కాలా’ తరవాత రజినీ చేస్తున్న సినిమా కావడం, సన్ పిక్చర్స్ నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రజినీ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని సీనియర్ నటి సిమ్రన్ ఇటీవలే ఖరారు చేశారు. ఇప్పుడు ఈ చిత్రంలో త్రిష కూడా నటిస్తున్నట్లు సన్ పిక్చర్స్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేసింది. రజినీతో త్రిషకు ఇదే తొలి చిత్రం. అవకాశాలు తగ్గిన ఇలాంటి సమయంలో త్రిషకు ఇంత పెద్ద ఆఫర్ రావడం నిజంగా గొప్ప విషయమే. 
Recent Post