ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ‌రికృష్ణ క‌న్నుమూత‌.. శోక సముద్రంలో టాలీవుడ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 29, 2018, 10:17 AM



నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మృతిచెందారు. ఆయన మృతి నందమూరి అభిమానులతోపాటు, తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.


ఈ వార్త వినడం చాలా బాధ కలిగించింది. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్‌, కళ్యాణ్‌తో పాటు కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.- కాజల్‌


నందమూరి హరికృష్ణ గారి మరణవార్త షాక్‌కు గురిచేసింది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను- అల్లరి నరేష్‌


ఈ రోజు నిద్రలేవగానే ఇంత ఘోరమైన వార్త వినాల్సి వచ్చింది. ఇది నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్‌, కళ్యాణ్‌తోపాటు కుటుంబసభ్యులందరికి ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలి- సుధీర్‌ బాబు


హరికృష్ణ గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.- సాయిధరమ్‌ తేజ్‌


ఇది నమ్మశక్యంగా లేదని డైరక్టర్‌ హరీశ్‌ శంకర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.


హరికృష్ణ గారి గురించి ఇలాంటి వార్త వినడం నమ్మలేకపోతున్నాను. చాలా గొప్ప వ్యక్తి. నాకు, నా తండ్రికి ఆయన చాలా ఆప్తుడు. ఆ భగవంతుడు కుటుంబసభ్యులకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.- దేవీశ్రీ ప్రసాద్‌


ఈ వార్త నన్ను చాలా షాక్‌కు గురిచేసింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – మంచు లక్ష్మీ


ఈ వార్త వినడం చాలా బాధకరంగా ఉంది. నందమూరి కుటుంబసభ్యులకు నా సంతాపన్ని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలిని కోరుకుంటున్నాను- అల్లు శిరీష్‌


ఈ వార్త విని షాక్‌కు గురయ్యాను. నాకు మాటలు రావడం లేదు. దేవుడు కఠినమైనవాడు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను- మంచు మనోజ్‌


ఈ వార్త నన్న షాక్‌కు గురిచేసింది. ఆయన మృతి నందమూరి కుటుంబానికి తీరని లోటు. ఆయన మంచి వ్యక్తి, గొప్ప తండ్రి. నా బాధను వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ఇది విషాదకరమైన రోజు -కోన వెంకట్‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com