నందమూరి హరికృష్ణ మృతి అందరినీ కలచివేస్తుంది. ఎందరో ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. అక్కినేని నాగార్జునతో హరికృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పవచ్చు. వీళ్లిద్దరు కలిసి సీతారామరాజు చిత్రంలో కలిసి నటించారు. అన్నయ్య పాత్రలో హరికృష్ణ నటించగా తమ్ముడి పాత్రలో నాగార్జున ఒదిగిపోయారు. సినిమాలో వీరిద్దరూ అన్నదమ్ములుగా నటించినా.. నిజజీవితంలో కూడా వీళ్లిద్దరి బంధం అన్నదమ్ముల మాదిరే ఉంటుంది. అన్నయ్యలాంటి హరికృష్ణతో ఇంతటి బంధం ఉండటంతో మరణ వార్త విన్న నాగార్జున ఎంతో ఆవేదన చెందుతూ ఈ విధంగా ట్వీట్ చేశారు..
"చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు.. కొన్ని వారాల క్రితం విన్న మాటలు ఇప్పుడు నీతోనే వెళ్లిపోయాయి. నీతో పాటు నీ గర్జనను కోల్పోతున్నందుకు ఎంతగానో బాధగా ఉంది అన్నయ్య" అంటూ నాగ్ ట్వీట్ చేశారు.