ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్మీ.. ఇంకేమైనా మిగిలిందా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 30, 2018, 10:03 AM



ముందు బుల్లితెరపై కొంచెం పేరు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో నటించి ఫేమ్ పెంచుకుంటుంటారు చాలామంది అమ్మాయిలు. కానీ రష్మి గౌతమ్ మాత్రం దీనికి రివర్స్. ముందు ఆమె సినిమాల్లో నటించింది కానీ.. అక్కడ సరైన బ్రేక్ రాలేదు. దీంతో ‘జబర్దస్త్’ ప్రోగ్రాంకి యాంకర్ అయింది. అక్కడ ఆమెకు తిరుగులేని పేరొచ్చింది. ఈ పాపులారిటీతో మళ్లీ సినిమా అవకాశాలు అందుకుంది. ఐతే మొదట్లో మాదిరి సైడ్ క్యారెక్టర్లు చేయకుండా ‘గుంటూరు టాకీస్’ సినిమాలో ప్రధాన కథానాయికగా నటించిన రేష్మి.. అందులో హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ సినిమా రష్మికి మంచి క్రేజ్ తో పాటు అవకాశాలూ తెచ్చిపెట్టింది. కానీ వచ్చిన అవకాశాల్లో సరైనవి ఎంచుకోవడంలో రష్మి ఫెయిలైంది. రష్మి తర్వాత చేసినవన్నీ ఆమె హాట్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించినవే తప్ప.. విషయం ఉన్నవేవీ లేవు.


దీంతో రష్మి ఎంత వేగంగా ఎదిగిందో.. అంతే వేగంగా పడిపోయింది. తాజాగా రష్మి నుంచి ‘అంతకుమించి’ అనే సినిమా వచ్చింది. దీని గురించి అసలు ప్రేక్షకులకు పట్టింపే లేదు. ఎప్పట్లాగే ఈ సినిమాకు కూడా రష్మి అందాల ద్వారానే ఆకర్షణ తెచ్చే ప్రయత్నం చేశారు. అదేమాత్రం ఫలించలేదు. సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదుు అన్నట్లుంది పరిస్థితి. రష్మి లాగే ‘జబర్దస్త్’ ద్వారా పేరు సంపాదించిన అనసూయకు కూడా సినిమాల్లో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ ఆమె ఏది పడితే అది ఒప్పుకోకుండా ‘క్షణం’.. ‘రంగస్థలం’ లాంటి సినిమాల్లో కీలకమైన పాత్రలు చేసి తన ప్రత్యేకతను చాటుకుంది. గ్లామర్ విషయంలో అనసూయ కూడా తక్కువేమీ కాదు. కానీ ఆమె దాన్ని నమ్ముకోలేదు. తనలోని నటికి పరీక్ష పెట్టే పాత్రలు ఎంచుకుంది. ఆ పాత్రల్లో మెప్పించింది. కానీ రష్మి మాత్రం దీనికి భిన్నంగా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకుని కెరీర్ ను దెబ్బ తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com