తమిళ హీరోయిన్ ఆండ్రియా ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలు చేసింది.. తెలుగు, తమిళ తెరపై తన అందాలను ఆరబోసింది.. ఆమె చేసిన పాత్రలన్నీ ఇప్పటి వరకూ బోల్డ్ గానే ఉన్నాయి.. లిప్ లాక్ లు చెప్పక్కర్లేదు.. ఇన్నీ చేసిన ఈ తమిళ భామ ఇకపై స్కిన్ షో చేయనని బహిరంగ ప్రకటన చేసింది..ఇన్ని రోజులు తనకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ రాస్తూ వచ్చిన దర్శకులకు కూడ ఇకపై అలాంటి పాత్రలను తన వద్దకు తీసుకురావద్దని కోరింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలైతే తప్ప నటించేది లేదని చెప్పింది..