ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ వర్ధంతి సందర్భంగా 'యాత్ర' నుంచి లిరికల్ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 30, 2018, 12:31 PM



దర్శకుడు మహి.వి రాఘవ్ .. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను 'యాత్ర' పేరుతో రూపొందిస్తున్నాడు. మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 90 శాతం వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ మమ్ముట్టి లుక్ మాత్రమే బయటికి వచ్చింది. ఆయన లుక్ వైఎస్ అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.


వచ్చేనెల 2వ తేదీన వైఎస్ వర్ధంతి .. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 7 గంటలకి ఈ సినిమా నుంచి 'సమరశంఖం' అనే లిరికల్ వీడియోను విడుదల చేయనున్నారు. ఎమోషనల్ గా సాగే ఈ లిరికల్ వీడియోతో సినిమాపై భారీ అంచనాలు పెంచాలనే ఉద్దేశంతో వున్నారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. పాదయాత్ర నేపథ్యంలో ఈ పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com