ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ‌లో గురు ప్రేమ‌కోసం డ‌బ్బింగ్ చెప్పిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 30, 2018, 02:49 PM



రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘హలో గురూ ప్రేమకోసమేస . అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో కథానాయిక. దిల్ రాజు నిర్మాత. ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15వ తేదిన విడుద‌ల కానుంది.. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటున్న‌ది.. అనుప‌మ త‌న పాత్ర డ‌బ్బింగ్ ను పూర్తి చేసింది.. అనుప‌మ తాను న‌టించిన చిత్రాల‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న‌ది.. ఇక ఈ మూవీని ఎడిట్ సూట్ లో తిల‌కించిన నిర్మాత దిల్ రాజు ఒకటి రెండు కీలకమైన సీన్స్ ను రీషూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశార‌ని టాక్. అందుకు త‌గ్గ‌ట్టుగానే ద‌ర్శ‌కుడు ఆ సీన్స్ ను రీషూట్ చేసే ప‌నిలో ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com