ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభినయ చక్రవర్తి

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 02, 2018, 11:54 AM



చిరంజీవి కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిసున్న చిత్రమిది. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ ేసతుపతి, జగపతిబాబు, సుదీప్‌ కీలక పాత్రధారులు. ఆదివారం సుదీప్‌ పుట్టినరోజు సందర్భంగా ‘సైరా’లో ఆయన పోషిస్తున్న ‘అవుకు రాజు’ లుక్‌ను విడుదల చేశారు. ‘‘మా అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌నకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సైరా’లోని ‘అవుకురాజు’ డైనమిక్‌ లుక్‌ మీ కోసం’’ అని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సుదీప్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది. నల్లని దుస్తులు ధరించిన సుదీప్‌ కోర మీసాలు, గడ్డంతో పాటు ఎడమవైపు ఒరలో కత్తితో, కుడి భుజంపై గొడ్డలితో వీరుడిలా నిలబడ్డారు. సోషల్‌ మీడియాలో ఈ పోస్టర్‌ వైరల్‌ అయింది. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగే సినిమా కావడంతో యాక్షన్‌ సన్నివేశాలను ‘స్కైఫాల్‌’, ‘హ్యారీపోటర్‌’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 6’ వంటి చిత్రాలకు పని చేసిన హాలీవుడ్‌ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com