ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలు అలా మారడానికి పురుషులే కారణం

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 02, 2018, 03:29 PM



జయం' చిత్రంతో తమిళ సినిమాకు పరిచయమైన నటి సదా. అజిత్‌, విక్రమ్‌ వంటి అగ్రహీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే అగ్రహీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. కానీ, ఆ తర్వాత సరైన విజయాలు లభించక వెండితెరకు బాగా దూరమైంది. కానీ అవకాశాల కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది.ఈ నేపథ్యంలో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'టార్చ్‌లైట్' వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1980ల్లో వేశ్యల జీవితంతో ఈ చిత్రం తెరకెక్కగా, ఇందులో సదా వేశ్యగా నటించింది. అలాగే 'కబాలి' ఫేమ్‌ రిత్విక కూడా వేశ్యగా కనిపించనుంది.


 ఈ సినిమా గురించి సదా మాట్లాడుతూ.. 'నేను ఇంతవరకు పాత్రలో నటించలేదు. మొదట్లో ఇది కూడా సాధారణమైన పాత్రగానే భావించాను. కానీ, ఇష్టం లేని వృత్తిలో మహిళలు ఎంతగా నలిగిపోతున్నారో వేశ్య పాత్రలో నటిస్తుంటే అర్థమైంది. మహిళలు ఎవరూ ఇష్టపడి ఈ వృత్తిలోకి రావడం లేదు. వారు అలా మారడానికి పురుషులే కారణం. వేశ్యల జీవితాల్లో చీకటివెలుగుల్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం' అని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com