ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ ద‌శ‌లో అడివి సాయికిర‌ణ్ `ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌`

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 03, 2018, 09:49 AM



ఎయిర్ టెల్ మోడ‌ల్ శ‌షా చెట్రి ,ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌`. వినాయ‌కుడు టాకీస్ బ్యాన‌ర్‌పై య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క‌ల్పిత కథాంశంతో.. ` వినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత` వంటి సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్ , పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్,టెక్నీషియన్స్ నిర్మాత‌లు. ఓ సినిమాలో ప‌నిచేసే యూనిట్ స‌భ్యులంద‌రూ క‌లిసి ఓ సినిమా నిర్మాణంలో భాగ‌మ‌వ‌డం ఇదే తొలిసారి. అలాగే ఎయిర్ టెల్ గర్ల్ గా పాపులర్ అయిన శషా చెట్రి ఈ సినిమా తో తెలుగులో పరిచయం అవుతున్నారు. `బొమ్మరిల్లు, కిక్, ఎవడు, మిస్టర్ పర్ఫెక్ట్, గూఢచారి` లాంటి చిత్రాలకు రచయితగా పని చేసి, కమలహాసన్, తమిళ్ శంకర్ తో కూడా పనిచేసిన స్టార్ రైటర్ అబ్బూరి రవి ఈ చిత్రానికి రచయితగానే కాకుండా, మొట్ట మొదటి సారిగా పవర్ ఫుల్ విలన్ పాత్రని ఈ చిత్రంలో పోషిస్తున్నారు. అతడు సినిమాలో యంగ్ మహేష్ బాబు గా , చత్రపతి సినిమాలో యంగ్ ప్రభాస్ గాను, తనదైన గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ నందం ఈ సినిమా లో ఒక స్టైలిష్ విలన్ గా కనపడతాడు. ఇంకా, పోకిరి , హ్యాపీడేస్ లాంటి చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి , వినాయకుడు తో హీరో గా అలరించిన కృష్ణుడు ఈ చిత్రంలో ఒక విచిత్రమైన కామెడీ పాత్రని పోషిస్తున్నారు. ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి ఈ సినిమాకు సాహిత్యాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com