పాప్ సింగర్‌తో బిషప్ అసభ్యంగా ప్రవర్తించాడు. హాలీవుడ్ కి చెందిన అరేథా ఫ్రాంక్లిన్ అనే ప్రముఖ గాయని ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయింది. ఈ సందర్భంగా డెట్రాయిట్లో ఫ్రాంక్లిన్ పేరిట సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికన్ పాప్‌స్టార్ ఆరియానా..ఫ్రాంక్లిన్‌కు ఎంతో ఇష్టమైన ఓ పాట పాటను పాడారు. ఇందుకు ఆరియానాను మెచ్చుకుంటూ కార్యక్రమానికి హాజరైన చార్ల్స్ ఎల్లిస్ అనే బిషప్ ఆమెను అసభ్యంగా కౌగిలించుకున్నాడు. దాంతో ఆరియానాతో పాటు అక్కడున్నవారంతా షాకయ్యారు. ఈ దృశ్యాలు కాస్తా అక్కడి మీడియా వర్గాలు రికార్డ్ చేయడంతో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వివాదంపై బిషప్ చార్ల్స్ స్పందిస్తూ.. ఓ మహిళతో నేనెప్పుడూ అలా అసభ్యంగా ప్రవర్తించను. నాకు తెలీకుండానే అలా జరిగిపోయింది. బహుశా నేను హద్దులు మీరి ప్రవర్తించి ఉంటాను. ఆమెతో మరింత సన్నిహితంగా ఉండాలని ప్రయత్నించి ఉంటాను. అందుకు నేను ఆరియానాను, ఆమె అభిమానులకు క్షమాపణను కోరుతున్నానని తెలిపాడు.