‘‘నేను వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. అలాంటప్పుడు ‘నరగాసురన్తో శ్రియ కమ్ బ్యాక్’ అని ఎందుకు అంటున్నారు?’’ అని అడుగుతున్నారు శ్రియ. ఆమె నటించిన తమిళ సినిమా ‘నరగాసురన్’ ఈ నెల 13న విడుదల కానుంది. శ్రియ మాట్లాడుతూ ‘‘సినిమాల్లోకి రావాలని నేను అనుకోలేదు. కానీ వచ్చిన తర్వాత నా గౌరవాన్ని పెంచే సినిమాలే చేశాను. నా ఆలోచనలకు దగ్గరగా ఉన్నవారితోనే కలిసి పనిచేశాను. నేను ఎంతో కొంత నేర్చుకోగలను అనుకున్నవారితోనే ఉన్నాను. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా అటు అనుభవజ్ఞులతో పనిచేస్తూనే, మరోవైపు కొత్తవారికి కూడా కాల్షీట్లు కేటాయించాను. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా మీద నా దృష్టి మారింది. ఈ మాట విన్నవారందరూ అంటే ‘ఇకపై డ్యాన్సులు చేయరా’ అని అడుగుతారు. ‘చేస్తాను. కానీ డ్యాన్స్ బేస్డ్ సినిమాలు చేస్తాను’ అనేది నా సమాధానం. మహిళల గురించి మరిన్ని సినిమాలు రావాలి’’ అని అన్నారు.