ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పుడు కిరిక్ పార్టీ హిందీలో

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 04, 2018, 12:00 PM



క‌న్న‌డ‌లో సూప‌ర్ హిట్ సాధించిన కామెడీ చిత్రం కిరిక్ పార్టీ తెలుగులో రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే. నిఖిల్ ప్ర‌ధాన పాత్ర‌లో కిరిక్ పార్టీ రీమేక్ కాగా, ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బేన‌ర్ పై డెబ్యూ ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. చిత్రానికి చందూ మొండేటి డైలాగ్స్ రాసాడు. సుధీర్ వ‌ర్మ స్క్రీన్ ప్లే అందించాడు. సంయుక్తా హెగ్డే .. సిమ్రాన్ పరీన్జా క‌థానాయిక‌లుగా న‌టించారు . అజ‌నీష్ లొక‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. వెరైటీ క‌థాంశంతో ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందిన ఈ చిత్రం తెలుగు అభిమానుల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. అయితే ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఫిలిం క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. కార్తీక్ ఆర్య‌న్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ అభిషేక్ జైన్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. అజ‌య్ క‌పూర్, ధీర‌జ్ వ‌ద‌వ‌న్‌, వ్రితిక ల‌య‌క‌ర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించ‌నున్నారు. ఇంజ‌నీరింగ్ స‌మ‌యంలో స్నేహితుల మ‌ధ్య జ‌రిగే స‌ర‌దా జ‌ర్నీ నేప‌థ్యంలో కిరిక్ పార్టీ చిత్రం రూపొంద‌నుంది. హిందీలో ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడ‌తారో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com