ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను సంప్రదించలేదంటున్నరాశి ఖన్నా

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 04, 2018, 03:18 PM



టాలీవుడ్ లో ఇప్పుడు సెట్స్ పై ఉన్న సినిమాలలో ఎన్టీఆర్ బయోపిక్ ఒక క్రేజీ ప్రాజెక్ట్. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటి విద్యా బాలన్ బసవతారకం పాత్రలో నటిస్తున్నారు.  ఇక రానా దగ్గుబాటి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు.  ఇతర పాత్రల్లో చాలామంది పాపులర్ స్టార్స్ నటిస్తున్నారు.  అలానే జయప్రద పాత్రలో బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా నటుస్తుందని ఈమధ్య వార్తలు వచ్చాయి.  రాశి ఖన్నా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం పై స్పందించింది.


తనను 'ఎన్టీఆర్' సినిమాలో ఏ పాత్ర కోసం ఎవరూ సంప్రదించలేదని- అవి జస్ట్ రూమర్స్ అని తేల్చిపారేసింది.  ఈ న్యూస్ అభిమానులను  కాస్త నిరాశపరిచేదే.  మరి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నానని - విజయ్ లాంటి టాలెంటెడ్ హీరో తో నటించడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని తెలిపింది.  క్రాంతి మాధవ్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఆ సినిమాలో తన పాత్రకు మంచి స్కోప్ ఉందని చెప్పింది. 


ఎలాంటి పాత్రలు ఎంచుకుంటారని అడిగితే అన్ని రకాల  పాత్రలు చేయడం ఇష్టమేనని చెప్పింది.  గ్లామరస్ పాత్రల్లో నటించడం సులభమే కానీ నటనకు స్కోప్ ఉండే పాత్రలను ప్రిఫర్ చేస్తానని చెప్పింది.  అన్నీ మాట్లాడింది కానీ 'శ్రీనివాస కళ్యాణం' ఊసు మాత్రం లేదు!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com