లెజెండ్ చిత్రంతో హీరో నుండి విలన్‌గా టర్న్ తీసుకున్న జగపతి బాబు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 13 సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన తానాజీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న తానాజీ చిత్రానికి ఓం రావత్ దర్శకుడు. ఛత్రపతి శివాజీ కోసం పోరాడిన సుబేదార్ తానాజీ పాత్రలో అజయ్ దేవగన్ నటించనుండగా, జగపతి బాబుని ముఖ్య పాత్రకి ఎంపిక చేశారు. రీసెంట్గా ఆయన పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ లుక్ టెస్ట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోరమీసంతో వారియర్‌గా జగ్గూభాయ్ లుక్ అందరిని ఆకర్షించేలా ఉంది. ఈ చిత్ర రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ 25 నుండి ప్రారంభం కానుంది. చిత్రం 2019లో విడుదల కానుంది.