బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ట్రిప్లెక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’. ప్రముఖ హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌తో కలిసి నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతుంది. ఈ సీక్వెల్లో దీపికాకు చోటుందో లేదో అనే విషయంపై ఊహాగానాలు తప్పితే స్పష్టత లేదు. తాజాగా ఈ చిత్రంలో దీపిక నటిస్తున్న విషయాన్ని చిత్ర దర్శకుడు డీజే కరుసో ధ్రువీకరించారు. ఈ ఫ్రాంఛైజీలో వస్తున్న ఈ నాలుగో చిత్రంలో చైనా నటుడు రాయ్ వాంగ్ కూడా నటించనున్నట్లు కరుసో ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి దీపిక సంగతేంటి.. ఆమె నటిస్తుందా.. అని ట్విట్టర్లో అడిగితే అవును అని సమాధానం ఇచ్చారు.