ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నానికి జోడిగా నర్తనశాల ఫేం కశ్మీరా పరదేశీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 05, 2018, 04:31 PM



ప్రస్తుతం దేవదాస్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్‌ హీరో నాని ఆ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ప్రకటించాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న  క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించనున్నాడు నాని. జెర్సీ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నానికి జోడిగా నర్తనశాల ఫేం కశ్మీరా పరదేశీ నటించనున్నారు.


నాని క్రికెటర్‌ అర్జున్‌గా నటిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమయిన ఈ సినిమా అక్టోబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనుంది. ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com