నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన ‘వీరభద్ర’లో నటించిన తనుశ్రీ దత్తా, యువహీరో తనీష్ సరసన ‘చాణక్యుడు’లో నటించిన ఇషితా దత్తాలు బిగ్‌బాస్‌లో సందడి చేయనున్నారు. ఇటీవల ‘బిగ్‌బాస్-12’ లాంచింగ్ ఈవెంట్లో సల్మాన్‌ఖాన్ కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు వెల్లడించారు. వారిలో తనుశ్రీ దత్తా, ఇషితాదత్తా ఉన్నారు. వీరు అక్కాచెల్లెళ్లు. బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా యూనివర్శ్ తనుశ్రీ దత్తా తన సోదరి ఇషితా దత్తాతో పాటు ఈ షోలో పార్టిసిపేట్ చేయనుంది. ప్రతీ సీజన్లో కొత్తదనాన్ని పరిచయం చేస్తున్న బిగ్‌బాస్ టీమ్ ఈసారి జోడీ కాన్సెప్ట్‌తో ముందుకు వస్తోంది. బిగ్ బాస్-12 (హిందీ) సెప్టెంబరు 16 నుంచి ప్రారంభం కానుంది.